Breaking News

ప్రపంచ రెండో ర్యాంకర్‌పై ప్రజ్ఞానంద... ప్రపంచ మూడో ర్యాంకర్‌పై వైశాలి సంచలన విజయాలు

Published on Mon, 06/03/2024 - 03:09

నార్వే చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లు, తోబుట్టువులైన ప్రజ్ఞానంద, వైశాలి సంచలన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. స్టావెంజర్‌ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ పురుషుల విభాగం ఐదో రౌండ్‌లో ప్రజ్ఞానంద 77 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు. ఇదే టోర్నీ మూడో రౌండ్‌లో ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. 

ఇదే వేదికపై జరుగుతున్న మహిళల టోర్నీ ఐదో రౌండ్‌ గేమ్‌లో ప్రజ్ఞానంద సోదరి వైశాలి తెల్ల పావులతో ఆడి ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ టింగ్జీ లె (చైనా)పై 76 ఎత్తుల్లో గెలిచింది. వీరిద్దరి మధ్య క్లాసికల్‌ గేమ్‌ ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్‌’ గేమ్‌ నిర్వహించారు. 

ప్రపంచ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ (చైనా), భారత స్టార్‌ కోనేరు హంపి మధ్య క్లాసికల్‌ గేమ్‌ 31 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్‌’ గేమ్‌ నిర్వహించగా జు వెన్‌జున్‌ 64 ఎత్తుల్లో హంపిపై గెలిచింది. 

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)