Breaking News

షఫాలీ విధ్వంసకర శతకం వృథా.. బెంగాల్‌ ప్రపంచ రికార్డు

Published on Tue, 12/24/2024 - 10:12

బీసీసీఐ దేశవాళీ సీనియర్‌ మహిళల వన్డే టోర్నీ(Senior Women’s One-Day)లో సోమవారం నాటి మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తద్వారా లక్ష్య ఛేదనలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది.  హరియాణా, బెంగాల్‌ జట్ల మధ్య జరిగిన పోరులో ఈ ఘనత చోటు చేసుకుంది.

కాగా సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో బెంగాల్‌ 5 వికెట్లతో హరియాణాపై నెగ్గింది. ముందుగాబ్యాటింగ్‌ చేసిన హరియాణా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. 

షఫాలీ ఊచకోత
హరియాణా బ్యాటర్లలో కెప్టెన్‌ షఫాలీ వర్మ (115 బంతుల్లో 197; 22 ఫోర్లు, 11 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించింది. షఫాలీకి సోనియా (61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రీమా (58; 8 ఫోర్లు), త్రివేణి (46; 5 ఫోర్లు) అండగా నిలిచారు.

తనుశ్రీ సర్కార్‌ ధనాధన్‌ సెంచరీ
అనంతరం బెంగాల్‌ 49.1 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసి ఛేదనలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. బెంగాల్‌ ఓపెనర్లు ధారా గుజ్జార్‌, సస్తి మొండల్‌ కేవలం 9.1 ఓవర్లలోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గుజ్జార్‌ 49 బంతుల్లో 69, మొండల్‌ 29 బంతుల్లో 52 పరుగులు బాదారు. 

ఇక ఆల్‌రౌండర్‌ తనుశ్రీ సర్కార్‌(Tanusree Sarkar) ఆకాశమే హద్దుగా చెలరేగి.. 83 బంతుల్లోనే 113 రన్స్‌ రాబట్టింది. ప్రియాంక బాల 81 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.

కాగా 2019లో కాంటర్‌బరీ టీమ్‌ 309 పరుగుల లక్ష్యాన్ని విధించగా ... నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ 312 పరుగులు చేసి గెలిచిన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. బెంగాల్‌ తరఫున ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ తనుశ్రీ సర్కార్‌ (83 బంతుల్లో 113; 20 ఫోర్లు) శతకం సాధించింది.   

చదవండి: BGT: అశ్విన్‌ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)