Breaking News

యువ భారత్‌కు రెండో విజయం

Published on Mon, 10/21/2024 - 03:11

జోహర్‌ బహ్రు (మలేసియా): సుల్తాన్‌ జోహర్‌ కప్‌ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో భారత కుర్రాళ్లు 6–4 గోల్స్‌ తేడాతో బ్రిటన్‌ జట్టును కంగుతినిపించారు. మ్యాచ్‌ ఆరంభమైన కొన్ని నిమిషాలకే ఆటగాళ్ల దాడులు మొదలయ్యాయి. ఈ క్రమంలో బోణీ బ్రిటన్‌ 2వ నిమిషంలో కొడితే... ఆఖరుదాకా భారత్‌ అదరగొట్టింది. మొహ్మద్‌ కొనయిన్‌ దాద్‌ ఏడో నిమిషంలో భారత్‌ ఖాతా తెలిచాడు. మొదటి పది నిమిషాల్లోపే ఒకసారి 1–1తో... తర్వాత 20వ నిమిషంలో రెండో సారి 2–2తో స్కోరు సమమైంది. 

ఇక అక్కడి నుంచి భారత్‌ ప్రతాపానికి పైమెట్టుగా సాగింది. దిల్‌రాజ్‌ సింగ్‌ (17వ, 50వ నిమిషాల్లో), శారదానంద్‌ తివారీ (20వ, 50వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయడంతో బ్రిటన్‌ ఇక మ్యాచ్‌లో తేరుకోలేకపోయింది. మధ్యలో మన్‌మీత్‌ సింగ్‌ (26వ ని.లో) గోల్‌ సాధించడంతో ఒక దశలో భారత్‌ 4–2తో ఆధిక్యాన్ని అమాంతం పెంచుకుంది. 

ప్రత్యర్థి జట్టులో రోరి పెన్‌రోజ్‌ (2వ, 15వ ని.లో), మైకేల్‌ రాయ్‌డెన్‌ (46వ, 59వ ని.లో) చెరో రెండు గోల్స్‌లో చేసి అంతరాన్ని అయితే తగ్గించగలిగారు కానీ... భారత్‌ ధాటి నుంచి పరాజయాన్ని తప్పించలేకపోయారు. ఆరంభంలోనే బ్రిటన్‌ శిబిరం గోల్‌ చేయడంతో భారత రక్షణ పంక్తి తమ లోపాలను వెంటనే సరిదిద్దుకుంది. 

దీనికితోడు స్ట్రయికర్లు కూడా క్రమం తప్పకుండా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై విజయవంతంగా లక్ష్యంపై గురిపెట్టడంతో భారత్‌ విజయం సులువైంది. తొలిమ్యాచ్‌లో భారత్‌ 4–2తో జపాన్‌ను చిత్తు చేసింది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)