Breaking News

ముంబై ఇండియన్స్‌కు రెండో విజయం 

Published on Mon, 02/26/2024 - 04:22

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌–2)లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని ముంబై 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై గెలుపొందింది. మొదట గుజరాత్‌ మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.

తనూజ (21 బంతుల్లో 28; 4 ఫోర్లు), కెప్టెన్, ఓపెనర్‌ బెత్‌ మూనీ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు), క్యాథ్రిన్‌ బ్రిస్‌ (24 బంతుల్లో 25 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడారు. ముంబై బౌలర్లు అమెలియా కెర్‌ (4/17), షబ్నమ్‌ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్‌ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి గెలిచింది.

ఓపెనర్లు యస్తిక భాటియా (7), హేలీ మాథ్యూస్‌ (7) నిరాశపరచగా... కెప్టెన్   హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (41 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించింది. హర్మన్, అమెలియా కెర్‌ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. గుజరాత్‌ బౌలర్లలో తనూజ 2, బ్రిస్, లి తహుహు చెరో వికెట్‌ తీశారు. నేడు జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో యూపీ వారియర్స్‌ తలపడుతుంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)