Breaking News

నీరజ్‌ చోప్రాకు రెండో స్థానం

Published on Mon, 09/18/2023 - 02:58

యుజీన్‌ (అమెరికా): ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ గ్రాండ్‌ ఫైనల్స్‌లో భారత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా తన టైటిల్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. ఆరుగురు పాల్గొన్న ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్‌ చోప్రా జావెలిన్‌ను 83.80 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్‌ వాద్లెచ్‌ జావెలిన్‌ను 84.24 మీటర్ల దూరం విసిరి చాంపియన్‌గా అవతరించాడు.

గత నెలలో ప్రపంచ చాంపియన్‌íÙప్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన నీరజ్‌ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 83.80 మీటర్ల దూరం పంపించాడు. మూడో ప్రయత్నంలో 81.37 మీటర్లు దూరం విసిరిన నీరజ్‌ నాలుగో ప్రయత్నంలో ఫౌల్‌ చేశాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో 80.74 మీటర్లు, చివరిదైన ఆరో ప్రయత్నంలో 80.90 మీటర్లు విసిరాడు. రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌కు 12,000 డాలర్లు (రూ. 9 లక్షల 97 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.   

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు