Breaking News

చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ ప్లేయర్‌.. కపిల్‌ దేవ్‌ రికార్డు బద్దలు

Published on Sat, 06/07/2025 - 18:13

అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో స్కాట్లాండ్ ఆల్ రౌండర్ బ్రాండ‌న్ మెక్‌ముల్లెన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగుల‌తో పాటు 50 వికెట్లు సాధించిన రెండో ఆట‌గాడిగా మెక్‌ముల్లెన్ చ‌రిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023-27 లీగ్ టూలో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రాండన్ ఈ రికార్డు సాధించాడు.

ఈ ఫీట్‌ను స్కాటిష్ ఆల్‌రౌండర్ తన 33వ వన్డే ఇన్నింగ్స్‌లోనే అందు​కోవడం విశేషం. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్లు కపిల్‌దేవ్‌(46 ఇన్నింగ్స్‌లు), లాన్స్ క్లూసెనర్(42 ఇన్నింగ్స్‌లు), స్టీవ్ వా (46 ఇన్నింగ్స్‌లు) షకీబ్ అల్ హసన్‌(50 ఇన్నింగ్స్‌లు)ను మెక్‌ముల్లెన్ అధిగమించాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో నెదర్లాండ్స్ క్రికెట్ దిగ్గజం ర్యాన్ టెన్ డెష్కాట్ అగ్రస్ధానంలో ఉన్నాడు.

డెష్కాట్ కేవలం 25 వన్డే ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. ఇక బ్రాండన్ మెక్‌ముల్లెన్.. తన 33 మ్యాచ్‌ల వన్డే కెరీర్‌లో  4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో సహా 1,149 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 151గా ఉంది. అదేవిధంగా  20.09 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉంది.

డచ్ జట్టు చిత్తు..
కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. డచ్ జట్టుపై స్కాట్లాండ్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. స్కాటిష్ బ్యాటర్లలో ఫిన్లే మెక్‌క్రీత్ (106 బంతుల్లో 7 ఫోర్లు ఒక సిక్సర్‌తో  81) టాప్ స్కోరర్‌గా నిలవగా..మార్క్ వాట్ (72 బంతుల్లో 5 ఫోర్లు,  2 సిక్సర్‌లతో 60) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్య చేధనలో నెదర్లాండ్స్ 45 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)