Breaking News

టీ20 ప్రపంచకప్‌కు మరో రెండు జట్లు

Published on Sun, 02/01/2026 - 17:54

 

ఈ ఏడాది ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ వేదికగా జరుగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ అర్హత సాధించాయి. నేపాల్‌లో జరుగుతున్న క్వాలిఫయర్‌ పోటీల ద్వారా ఈ రెండు జట్లు ప్రపంచకప్‌ బెర్త్‌ దక్కించుకున్నాయి. ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ జట్లు కూడా ప్రపంచకప్‌ అర్హత సాధించాయి.

ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో అమెరికా పై విజయం సాధించడంతో స్కాట్లాండ్‌ ప్రపంచకప్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్కాట్లండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటి అమెరికాను మట్టికరిపించింది.

మరోవైపు థాయ్‌లాండ్‌పై గెలుపుతో ఐర్లాండ్‌ ‍ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ తక్కువ స్కోరే చేసిన, దాన్ని విజయవంతంగా కాపాడుకుంది. కాగా, ఈ గ్లోబల్‌ క్వాలిఫయర్‌ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనగా.. బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌ టాప్‌-4లో నిలిచి ప్రపంచకప్‌ టికెట్‌ దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భారత్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌, శ్రీలంక నేరుగా ప్రపంచకప్‌ అర్హత సాధించాయి.

కాగా, జూన్‌ 12న బర్మింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్‌ 14న భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి టైటిల్‌. ఆ ఎడిషన్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)