Breaking News

సత్యన్‌ జోడీకి టైటిల్‌

Published on Sun, 07/27/2025 - 04:13

లాగోస్‌ (నైజీరియా): వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) కంటెండర్‌ టోర్నమెంట్‌లో... భారత ప్యాడ్లర్లు సత్యన్‌ జ్ఞానశేఖరన్‌–ఆకాశ్‌ పాల్‌ టైటిల్‌ దక్కించుకున్నారు. తెలంగాణ ప్లేయర్‌ ఆకుల శ్రీజ ఫైనల్లో మహిళల సింగిల్స్‌ పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శనివారం పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సత్యన్‌–ఆకాశ్‌ జోడీ 3–0 (11–9, 11–4, 11–9)తో లియో నోడ్‌రెస్ట్‌–జులెస్‌ రోలాండ్‌ (ఫ్రాన్స్‌) ద్వయంపై విజయం సాధించింది. 

పూర్తి ఏకపక్షంగా సాగిన తుది పోరు కేవలం 22 నిమిషాల్లో ముగియగా... భారత ప్యాడ్లర్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు. మ్యాచ్‌ ఆరంభం నుంచి జోరు కనబర్చిన భారత జోడీ తమ సర్వీస్‌లో 19 పాయింట్లు సాధించడంతో పాటు... ప్రత్యర్థి సర్వీస్‌లో 14 పాయింట్లు రాబట్టి మ్యాచ్‌ను ముగించింది. ఇక మహిళల సింగిల్స్‌ ఫైనల్లో శ్రీజ 1–4 (7–11, 3–11, 4–11, 11–9, 11–13)తో రెండో సీడ్‌ హొనొకా హషిమోటో (జపాన్‌) చేతిలో ఓడింది. 

48 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి మూడు గేమ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేక వెనుకబడి పోయిన శ్రీజ ఆ తర్వాత పుంజుకొంది. నాలుగో గేమ్‌లో హోరాహోరీగా పోరాడి విజయం సాధించిన శ్రీజ... ఐదో గేమ్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లింది. అయితే కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన జపాన్‌ ప్యాడ్లర్‌ ఒత్తిడి పెంచి విజయం సాధించింది.  

#

Tags : 1

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)