Breaking News

డీఎస్పీగా సామ సాత్విక

Published on Mon, 09/29/2025 - 04:25

సాక్షి, హైదరాబాద్‌: టెన్నిస్‌ కోర్టులో సంచలన విజయాలతో రాణించిన హైదరాబాద్‌ ప్లేయర్‌ సామ సాత్విక... తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్‌–1 పరీక్షల్లో సత్తా చాటి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) కొలువు సాధించింది. ఆరేళ్ల ప్రాయంలో టెన్నిస్‌ రాకెట్‌ చేతపట్టి జూనియర్‌ స్థాయిలో వరుస విజయాలతో దూసుకెళ్లిన సాత్విక... డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో 2020లో అత్యుత్తమంగా 809వ ర్యాంక్‌ సాధించింది.

హార్డ్‌ కోర్ట్‌పై సత్తాచాటిన ఈ హైదరాబాదీ... 2019 దక్షిణాసియా క్రీడల మహిళల సింగిల్స్‌లో పసిడి పతకంతో మెరిసింది. 2022 తర్వాత ఆటకు విరామమిచ్చిన సాత్విక... తాజాగా గ్రూప్‌–1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీ పోస్టుకు అర్హత సాధించింది. 

శనివారం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా 25 ఏళ్ల సాత్విక నియామక పత్రం అందుకుంది. ఐటీఎఫ్‌ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 527వ స్థానంలో నిలిచిన సాత్విక ఆ తర్వాత టెన్నిస్‌ కాలమిస్ట్‌గానూ ఆకట్టుకుంది.   

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు