Breaking News

క్వార్టర్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Published on Tue, 07/30/2024 - 06:04

పారిస్‌: పతకమే లక్ష్యంగా పారిస్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్‌ ‘సి’ నుంచి సాత్విక్‌–చిరాగ్‌...ఫజర్‌–అర్దియాంతో (ఇండోనేసియా) జోడీలు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. గాయం కారణంగా గ్రూప్‌ ‘సి’లోని మార్క్‌ లమ్స్‌ఫుస్‌–మార్విన్‌ సిడెల్‌ (జర్మనీ) జోడీ వైదొలిగింది. 

ఇదే గ్రూప్‌లో ఉన్న లుకాస్‌ కోరి్వ–రొనాన్‌ లాబర్‌ (ఫ్రాన్స్‌) జంట ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దాంతో ఒక్కో మ్యాచ్‌లో నెగ్గిన భారత్, ఇండోనేసియా జోడీలు క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాయి. గ్రూప్‌ విజేతను నిర్ణయించే మ్యాచ్‌లో నేడు ఫజర్‌–అర్దియాంతోలతో సాతి్వక్‌–చిరాగ్‌ తలపడతారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాతి్వక్‌–చిరాగ్‌ జోడీ గ్రూప్‌ దశలోనే ని్రష్కమించింది. 

అశ్విని–తనీషా అవుట్‌ 
మహిళల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ విభాగంలో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్‌) ద్వయం వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడి క్వార్టర్‌ ఫైనల్‌ చేరే అవకాశాన్ని కోల్పోయింది. సోమవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో అశి్వని–తనీషా జోడీ 11–21, 12–21తో నామి మత్సుయామ–చిహారు షిదా (జపాన్‌) జంట చేతిలో ఓడిపోయింది. 

మరోవైపు పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎల్‌’ రెండో మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ (భారత్‌) 21–19, 21–14తో జూలియన్‌ కరాగి (బెల్జియం)పై గెలిచాడు. గ్వాటెమాలాకు చెందిన కెవిన్‌ కార్డన్‌ గాయంతో వైదొలిగాడు. ఫలితంగా కార్డన్‌పై లక్ష్య సేన్‌ గెలిచిన ఫలితాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గితేనే లక్ష్య సేన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంటాడు.   

బోపన్న జోడీ ఓటమి 
పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత వెటరన్‌ ప్లేయర్‌ రోహన్‌ బోపన్న నిరాశ పరిచాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–శ్రీరామ్‌ బాలాజీ జంట 5–7, 2–6తో వాసెలిన్‌–మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో ఓడింది. మ్యాచ్‌ అనంతరం బోపన్న మాట్లాడుతూ దేశం తరఫున ఇదే తన చివరి పోరు అని పేర్కొన్నాడు. ఇప్పటికే డేవిస్‌ కప్‌కు వీడ్కోలు పలికిన బోపన్న ఇకపై జాతీయ జట్టు తరఫున ఆడబోనని ప్రకటించాడు.  

రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్‌లో బోపన్నకు ఒలింపిక్‌ పతకం అందని ద్రాక్షలాగే మిగిలింది. 2016 రియో ఒలింపిక్స్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి నాలుగో స్థానంలో నిలిచిన బోపన్న.. ఇంత సుదీర్ఘ కాలం దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ఆనందించానని అన్నాడు. ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌కు టెన్నిస్‌లో ఏకైక పతకం 1996 అట్లాంటా క్రీడల్లో (లియాండర్‌ పేస్‌–కాంస్యం) దక్కింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)