Breaking News

ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Published on Thu, 01/09/2025 - 04:05

కౌలాలంపూర్‌: భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ స్టార్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ శెట్టి 21–10, 16–21, 21–5తో మింగ్‌ చె లు–టాంగ్‌ కాయ్‌ వె (చైనీస్‌ తైపీ)లపై గెలుపొందారు. 

56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్‌లో తడబడింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సాతి్వక్‌–చిరాగ్‌ చెలరేగి ప్రత్యర్థి జోడీ ఆట కట్టించారు.  సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోగా... ప్రియాన్షు రజావత్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. 

ప్రణయ్‌ 21–12, 17–21, 21–15తో బ్రియాన్‌ యాంగ్‌ (కెనడా)పై నెగ్గగా... ప్రియాన్షు 11–21, 16–21తో ఏడో సీడ్‌ షి ఫెంగ్‌ లీ (చైనా) చేతిలో ఓడిపోయాడు.  మహిళల సింగిల్స్‌లో మాళవిక బన్సోద్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... అనుపమా , ఆకర్షి కశ్యప్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. 

మాళవిక 21–15, 21–16తో గో జిన్‌ వె (మలేసియా)పై విజయం సాధించగా... ఆకర్షి 14–21, 12–21తో జూలీ జేకబ్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో, అనుపమ 17–21, 21–18, 8–21తో పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి పాలయ్యారు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)