Breaking News

ప్రిక్వార్టర్స్‌లో సతీశ్‌

Published on Thu, 08/22/2024 - 06:02

యోకోహామా: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ నుంచి సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌ ఒక్కడే మిగిలాడు. టోర్నీ రెండో రోజు బుధవారం బరిలోకి దిగిన భారత క్రీడాకారుల్లో సతీశ్‌ మినహా మిగతా వారందరూ ఓడిపోయారు. ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్‌ సతీశ్‌ 6–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 

ఈ దశలో ఆంటోన్‌సెన్‌ గాయం కారణంగా మ్యాచ్‌ నుంచి వైదొలగడంతో సతీశ్‌ను విజేతగా ప్రకటించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కాంతాపోన్‌ వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌)తో సతీశ్‌ తలపడతాడు. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో కిరణ్‌ జార్జి 19–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. 

జెస్పెర్‌ టాఫ్ట్‌–అమెలీ మాగెలుండ్‌ (డెన్మార్క్‌)తో జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 1–3తో వెనుకబడిన దశలో సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి (భారత్‌) జోడీ గాయం కారణంగా వైదొలిగింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రుతుపర్ణా పాండా–శ్వేతాపర్ణా (భారత్‌) ద్వయం 8–21, 14–21తో జూలీ ఫిన్‌–మాయ్‌ సురో (డెన్మార్క్‌) జోడీ చేతిలో పరాజయం పాలైంది.    

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)