Breaking News

IPL 2024: సర్ఫరాజ్‌ ఖాన్‌కు లక్కీ ఛాన్స్‌.. ఐపీఎల్‌లో రీ ఎంట్రీ!?

Published on Mon, 03/18/2024 - 09:46

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌-2024 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు సర్ఫరాజ్‌ ప్రాతినిథ్యం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ముందు గుజరాత్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రాబిన్‌ మింజ్‌ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలసిందే. దీంతో అతడు ఈ ఏడాది సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.

ఈ క్రమంలో మింజ్‌ స్ధానాన్ని సర్ఫరాజ్‌తో భర్తీ చేయాలని గుజరాత్‌ మేనెజ్‌మెంట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా గత ఐపీఎల్‌సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన సర్ఫరాజ్‌ను 2024 వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ విడుదల చేసింది. దీంతో రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సర్ఫరాజ్‌ను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్‌ అదరగొట్టడంతో గుజరాత్‌ ఫ్రాంచైజీ తమ జట్టులో చేర్చుకునేందుకు సిద్దమైంది. సర్ఫరాజ్‌ గతం ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు, ఆర్సీబీకి కూడా ప్రాతనిథ్యం వహించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 50 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్‌.. 585 పరుగులు చేశాడు. 
 ఇక ఈ ఏడాది సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్‌ వేదికగా ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)