Breaking News

Irani Cup 2024: సచిన్‌, ద్రవిడ్‌ సరసన సర్ఫరాజ్‌

Published on Wed, 10/02/2024 - 17:06

ఇరానీ కప్‌ 2024లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్‌ ఈ మార్కును తాకాడు. రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి సర్ఫరాజ్‌ 218 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా శార్దూల్‌ ఠాకూర్‌ (25) క్రీజ్‌లో ఉన్నాడు. 

133.4 ఓవర్ల అనంతరం ముంబై స్కోర్‌ 522/8గా ఉంది. ముంబై ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ అజింక్య రహానే (97), శ్రేయస్‌ అయ్యర్‌ (57), తనుశ్‌ కోటియన్‌ (64) అర్ద సెంచరీలతో రాణించారు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ దయాల్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో రెండు వికెట్లు తీశారు.

సచిన్‌, ద్రవిడ్‌ సరసన సర్ఫరాజ్‌
రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాపై సెంచరీతో సర్ఫరాజ్‌ ఖాన్‌ క్రికెట్‌ దిగ్గజాలైన సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌ సరసన​ చేరాడు. సర్ఫరాజ్‌కు ఇరానీ కప్‌లో ఇది రెండో సెంచరీ కాగా.. సచిన్‌, ద్రవిడ్‌ కూడా ఇరానీ కప్‌లో తలో రెండు సెంచరీలు చేశారు. ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, గుండప్ప విశ్వనాథ్‌కు దక్కుతుంది. 

ఈ ఇద్దరు ఇరానీ కప్‌లో తలో నాలుగు సెంచరీలు చేశారు. వెంగ్‌సర్కార్‌, విశ్వనాథ్‌ తర్వాత ఇరానీ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత హనుమ విహారి, అభినవ్‌ ముకుంద్‌, సునీల్‌ గవాస్కర్‌, వసీం జాఫర్‌లకు దక్కుతుంది. వీరంతా ఈ టోర్నీలో తలో మూడు సెంచరీలు చేశారు.

చదవండి: డబుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్‌ ఖాన్‌

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)