Breaking News

ఆమె పట్ల ఎందుకింత ద్వేషం.. ఇంతకు దిగజారుతారా?

Published on Fri, 02/02/2024 - 13:08

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు సంబంధించిన పాత వీడియో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. వైవాహిక బంధం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను హైలైట్‌ చేస్తూ అభిమానులు సానియాకు మద్దతుగా నిలుస్తున్నారు. పనిలో పనిగా సానియా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి దిమ్మతిరిగేలా కౌంటర్లు ఇస్తున్నారు.

కాగా పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను సానియా ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరగగా.. అప్పటికి ఇద్దరూ కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్నారు. దుబాయ్‌లో కాపురం పెట్టిన ఈ జంటకు 2018లో కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు.

అన్యోన్య దంపతులుగా పేరొందిన సానియా- షోయబ్‌ విడిబోతున్నారంటూ గత కొన్నిరోజులుగా వార్తలు రాగా.. వాటిని నిజం చేస్తూ షోయబ్‌ మాలిక్‌ తన కొత్త భార్యను పరిచయం చేశాడు. నటి సనా జావెద్‌ను పెళ్లాడినట్లు సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేశాడు.

ఈ విషయంపై స్పందించిన సానియా కుటుంబం.. సానియా తనకు తానుగా షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సానియా మీర్జాకు షోయబ్‌ వివాహేతర సంబంధాల గురించి తెలిసిందని సమాచారం.

ఈ నేపథ్యంలోనే అతడి ప్రవర్తన నచ్చక అతడి నుంచి విడిపోయిందని పాక్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక షోయబ్‌ పెళ్లి తర్వాత సానియా మీర్జా వరుస ఫొటోషూట్లు, ప్రొఫెషన్‌కు సంబంధించిన పనులతో బిజీ అయింది.

అయితే, కొంతమంది ఆకతాయిలు మాత్రం.. సానియా రెండో పెళ్లి అంటూ తప్పుడు కథనాలు అల్లుతున్నారు. టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ తాను పెళ్లి కొడుకు అవతారంలో ఉన్న ఫొటోను షేర్‌ చేయగా.. వక్రభాష్యాలు చెబుతూ ఈ టెన్నిస్‌స్టార్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సానియా అభిమానులు.. ‘‘సోషల్‌ మీడియాలో హైలైట్‌ కావడానికి ఇంతకు దిగజారుతారా? ఓ మహిళ గురించి ఇంత నీచంగా అబద్దాలు వ్యాప్తి చేస్తారా? ఆమె పట్ల ఎందుకింత ద్వేషం’’ అంటూ మండిపడుతున్నారు. వైవాహిక బంధం గురించి సానియా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. షోయబ్‌ లాంటి వ్యక్తిని విడిచిపెట్టి ఆమె మంచి పనిచేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

పాత వీడియోలో ఏముంది? 
కొత్తగా పెళ్లి చేసుకున్న వ్యక్తులకు మీరిచ్చే సలహా ఏమిటని గతంలో ఓ మహిళ సానియా మీర్జాను ప్రశ్నించింది. ఇందుకు బదులిస్తూ.. ‘‘పెళ్లికి ముందు మీరెలా ఉన్నారో అలాగే ఉండండి. జీవిత భాగస్వామి చెప్పారని మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మీలో ఉన్న ఆ ప్రత్యేక లక్షణాన్ని చూసే కదా వాళ్లు మీతో ప్రేమలో పడతారు’’ అని సానియా పేర్కొంది.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)