Breaking News

రాహుల్ ద్రవిడ్ కొడుకుకు బిగ్ షాక్‌..

Published on Tue, 07/15/2025 - 19:56

బెంగళూరు వేదికగా మంగళవారం మహారాజా ట్రోఫీ కేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఏ టీ20 టోర్నీ-2025 వేలం జరిగింది. ఈ వేలంలో - మైసూర్ వారియర్స్, హుబ్లి టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, గుల్బర్గా మిస్టిక్స్ మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తమ కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నాయి.

ఈ వేలంలో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌పై కాసుల వర్షం కురిసింది. అతడిని  హుబ్లి టైగర్స్ రికార్డు స్థాయిలో రూ.13.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పడిక్కల్‌ నిలిచాడు. అదేవిధంగా హుబ్లి టైగర్స్ అభినవ్ మనోహర్‌ను సైతం రూ. 12.20 లక్షలకు సొంతం చేసుకుంది. హుబ్లి ఫ్రాంచైజీ వీరిద్దరిపైనే దాదాపు సగంపైగా మొత్తాన్ని ఖర్చుచేసింది. టీమిండియా వెటరన్‌, కేకేఆర్ ఆటగాడు మనీష్ పాండేను రూ. 12.20 లక్షలకు మైసూర్ వారియర్స్ దక్కించుకుంది.

సమిత్ ద్రవిడ్‌కు బిగ్ షాక్‌..
కాగా మహారాజా టీ20 వేలంలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అమ్ముడుపోలేదు. రూ. 50 వేలు కనీస ధ‌ర‌తో వ‌చ్చిన అత‌డిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. సమిత్ ద్ర‌విడ్ గ‌త ఎడిష‌న్‌లో మైసూరు వారియర్స్ జ‌ట్టులో భాగంగా ఉన్నాడు.

అయితే అంచనాలకు తగ్గటు జూనియర్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. గత సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన సమిత్‌.. 11.71 సగటుతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం వేలంలో అమ్ముడు పోలేదని  క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ మెగా టోర్నీ బెంగ‌ళూరులోని ఐకానిక్ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా ఆగస్టు 11 నుంచి 27 వరకు జ‌ర‌గ‌నుంది.  అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ టోర్నీని ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఆర్సీబీ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈవెంట్‌లో కరుణ్‌ నాయర్‌, ప్రసిధ్ కృష్ణ, మయాంక్ అగర్వాల్ వంటి స్టార్‌ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)