Breaking News

సాక్షి టీమ్‌కు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు

Published on Thu, 12/11/2025 - 13:21

జర్నలిస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 విజేతగా సాక్షి టీవీ నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో టీవీ-9ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సాక్షి.. తొలి జేపీఎల్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. తుది పోరులో ప్రత్యర్ధి జట్టు నిర్ధేశించిన 92 పరుగుల లక్ష్యాన్ని సాక్షి ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఊదిపడేసింది.


 ఓపెనర్లు చైతన్య(21), రమేశ్‌(35 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీవీ-9.. 19.4 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. సాక్షి బౌలర్లలో రమేశ్‌ మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు శ్రీనాథ్‌ రెండు, శ్రీను, అగ్ని ఓ వికెట్‌ సాధించారు.

ఈ ఏడాది సీజన్‌ను సాక్షి టీవీ అజేయంగా ముగించింది. ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ విజయ ఢంకా మోగించింది. ఈ సీజన్‌ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రమేష్‌ (190 పరుగులు) ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఫైనల్లో ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు కూడా అతడికే లభించింది.

సాక్షి టీమ్‌కు మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు
జర్నలిస్ట్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌-2 విజేత అయిన సాక్షి టీవీ జట్టు కు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితెలియజేశారు . క్రీడా స్ఫూర్తితో ఈ లీగ్ లో పాల్గొన్న అన్ని మీడియా సంస్థలను మంత్రి అభినందించారు. 

నిత్యం వార్తల సేకరణలో ఉంటూ బిజీ షెడ్యూల్ గడిపే జర్నలిస్టు లకు ఇలాంటి క్రీడలు ఉల్లాసాన్నిస్తాయని తెలిపారు. భవిష్యత్తులో మీడియా మిత్రులకు ఇలాంటి క్రీడలపై ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలియజేశారు.

 

 

 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)