Breaking News

Sakshi Malik: నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను

Published on Fri, 08/30/2024 - 12:00

కొన్నాళ్ల క్రితం బౌట్‌లలో... మెడలో పతకాలతో... తదనంతరం ఢిల్లీ రోడ్లపై కనిపించిన భారత స్టార్‌ మహిళా రెజ్లర్‌ సాక్షి మలిక్‌ ఇప్పుడు అక్షర రూపంలో చదివించనుంది. ఆమె స్వీయచరిత్ర ఇప్పుడు పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘విట్‌నెస్‌’ పేరుతో ఆమె ఆత్మకథను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రచురణకర్తలు వెల్లడించారు. రచయిత జొనాథన్‌ సెల్వరాజ్‌ రాసిన ఈ పుస్తకాన్ని జుగ్గర్‌నాట్‌ బుక్స్‌ అనే సంస్థ ప్రచురించింది.

బౌట్‌లో నిబద్ధతను చాటిన ఆమె... పుస్తకంలో తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని నిజాయితీగా, నిక్కచ్చిగా వెలిబుచ్చి నట్లు పబ్లిషర్లు తెలిపారు. ఆమె బాల్యం, రోహ్‌తక్‌లోని అఖాడాలో రెజ్లింగ్‌ నేర్చుకోవడం, దాన్ని కెరీర్‌గా మలచుకోవడం అక్కడి నుంచి గ్రామీణ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల నుంచి ఏకంగా ‘రియో’ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మువ్వన్నెల పతాకాన్ని ఎగరేయడం దాకా అన్నీ పుస్తకంలో ఉన్నాయి. 

 వెన్నుచూపని తీరు
ఈ క్రమంలో ఆమె పడిన పాట్లు, ఓడినప్పుడు నేర్చుకున్న గుణపాఠాలు, పోరాటం పెట్టిన పరీక్షలు, భారత రెజ్లింగ్‌ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టలపై పిడికిలి బిగించిన వైనం, వెన్నుచూపని తీరు ఇవన్నీ కూడా పుస్తక రూపంలో అందుబాటులోకి రానుంది. కొన్ని ఆత్మకథలు ఆసక్తికర, నాటకీయ మలుపులకే పెద్దపీట వేస్తాయి. కానీ సాక్షి స్వీయచరిత్ర మాత్రం మలుపులతో కాదు... ప్రతి అడుగుతో ముడిపడి రాబోతోందని ప్రచురణ సంస్థ వెల్లడించింది. 

పురుషాధిక్య భారత రెజ్లింగ్‌ ప్రపంచంలో మహిళలకు ఎదురైన సవాళ్లు, శిక్షణ శిబిరంలో అబలల పాట్లు, బౌట్లలో ప్రత్యర్థులతో కుస్తీ పట్టినట్లే... ఆర్థిక సమస్యలపై పట్టిన కుస్తీ, బాడీ ఇమేజ్, డేటింగ్‌ ఇలా ఏ ఒక్కటీ వదలకుండా నిగూఢమైన నిజాలన్నీ పుస్తకంలో అక్షర సాక్ష్యాలు కానున్నాయి. ‘నా జీవితాన్ని నిజాయితీగా వివరించాను. ఎదురైన సవాళ్లు, ఎత్తు పల్లాలు ప్రతిఒక్కటి స్పృశించాను’ అని సాక్షి మలిక్‌ తెలిపింది.   

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)