Breaking News

పారిస్ ఒలింపిక్స్ విజేత‌ల‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓనర్‌ బంపరాఫర్‌..

Published on Fri, 08/02/2024 - 19:41

ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ తరపున పతకాలు సాధించేవారికి జేఎస్‌డ‌బ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ స‌జ్జ‌ల్ జిందాల్ బంపరాఫర్ ఇచ్చారు. ఈ విశ్వ క్రీడల్లో మెడల్స్‌ సాధించిన భారత క్రీడాకారుల‌కు 'ఎంజీ విండ్సర్' కారు బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్లు స‌జ్జ‌ల్ జిందాల్ ప్రకటించారు. 

ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా శుక్రవారం వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల్స్‌ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిందాల్ తెలిపారు. 

"భారత్ తరపున పతకం సాధించే ప్రతీ క్రీడాకారుడికి జేఎస్‌డ‌బ్ల్యూ గ్రూపు తరుపున 'ఎంజీ విండ్సర్స్‌ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ ప్రకటన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యుత్తమ వ్యక్తులు అత్యుత్తమైనవి పొందేందుకు అర్హులు కదా! వారి అంకిత భావం, విజయాల కోసమే ఇది అంటూ" ఎక్స్‌లో జిందాల్‌ రాసుకొచ్చాడు. 

కాగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్‌గా కూడా స‌జ్జ‌ల్ జిందాల్ ఉన్నారు. ఇక  ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో ప్రస్తుతం మూడు పతకాలు ఉన్నాయి. షూటింగ్‌లో మను భకర్‌  రెండు కాంస్య పతకాలు సాధించగా.. స్వప్నిల్‌ కుసాలే సింగ్‌ ఓ బ్రాంజ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు.

Videos

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Fire accident : చార్మినార్ ప‌రిధిలో భారీ అగ్నిప్రమాదం

కోనేరులోకి దూసుకెళ్లిన ఇన్నోవా.. తప్పిన పెను ప్రమాదం

తెలుగు ప్రజలకు YS జగన్ దసరా శుభాకాంక్షలు

పులివెందులలో ఖాకీ కుట్ర.. YSRCP శ్రేణులపై ఏకే 47తో కాల్పులు..

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)