Breaking News

‘మాతో పోలిస్తే అంతరం చాలా ఎక్కువ’

Published on Thu, 10/12/2023 - 04:14

సాక్షి, హైదరాబాద్‌: భారత మహిళల బ్యాడ్మింటన్‌లో వస్తున్న కొత్త తరం ఆటగాళ్లలో దూకుడు లోపించిందని ఒలింపిక్‌ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించే ధాటైన ఆట వారి నుంచి రావాలని ఆమె సూచించింది. సరిగ్గా చెప్పాలంటే తనతో పాటు సింధు తర్వాత వచ్చిన ప్లేయర్లు ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారని సైనా చెప్పింది. ‘నిజాయితీగా చెప్పాలంటే మా ఇద్దరికీ, కొత్తగా వచ్చిన మహిళా షట్లర్లకు మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉంది. మ్యాచ్‌ ఆరంభం నుంచి అటాక్‌ చేసే

మాలాంటి ప్లేయర్లు ఇప్పుడు భారత్‌కు కావాలి. త్వరలోనే మహిళల బ్యాడ్మింటన్‌లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా’ అని సైనా పేర్కొంది. ‘బ్యాడ్మింటన్‌ ప్రోస్‌’ పేరుతో కొత్తగా రానున్న బ్యాడ్మింటన్‌ అకాడమీకి సైనా మెంటార్‌గా వ్యవహరించనుంది. మాజీ ఆటగాడు అనూప్‌ శ్రీధర్, విజయ్‌ లాన్సీ కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొంది.

‘ప్రోస్‌ అకాడమీకి ప్రత్యేక కోచ్‌ల బృందం ఉంది. నాకున్న అనుభవాన్ని వారితో పంచుకునేందుకే మెంటార్‌గా పని చేయబోతున్నా. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బ్యాడ్మింటన్‌ అకాడమీలు రావడం సానుకూల పరిణామం’ అని సైనా పేర్కొంది. భారత షట్లర్‌ పారుపల్లి కశ్యప్, ప్రస్తుతం భారత టీమ్‌ కోచ్‌ల బృందంలో ఒకడైన గురుసాయిదత్‌ కూడా ఈ అకాడమీకి మెంటార్‌లుగా పని చేస్తారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)