అదే దూకుడు.. సాయిసుదర్శన్‌ విధ్వంసం! 8ఫోర్లు, 4 సిక్స్‌లతో

Published on Tue, 06/13/2023 - 08:23

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌-2023 సీజన్‌ను కోవై కింగ్స్ ఘనంగా ప్రారంభించింది. శ్రీరామకృష్ణ కళాశాల మైదానం వేదికగా ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిజన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగుల తేడాతో కోవై కింగ్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోవై కింగ్స్‌.. 14 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో సాయిసుదర్శన్‌ మరో బ్యాటర్‌ ముకిలేష్‌తో కలిసి కింగ్స్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముకిలేష్‌ ఔటైనప్పటికీ సాయిసుదర్శన్‌ మాత్రం స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 45 బంతులు ఎదుర్కొన్న సుదర్శన్‌.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఇక సుదర్శన్‌ సంచలన ఇన్నింగ్స్‌ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తిరుప్పూర్ తమిజన్స్‌ 109 పరుగులకే కుప్పకూలింది.  కోవై కింగ్స్‌ బౌలర్లలో కెప్టెన్‌ షారుఖ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్‌ రెండు, ముకిలేష్‌, జాతవేద్ సుబ్రమణ్యన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరపున ఆడిన సాయిసుదర్శన్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. సీఎస్‌కేతో జరిగిన ఫైనల్లో 96 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.
చదవండి: LPL 2023: లంక ప్రీమియర్‌ లీగ్‌ ఆడనున్న సురేష్‌ రైనా.. ధర ఎంతంటే?


 

#

Tags : 1

Videos

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)