Breaking News

CSK Vs GT: చ‌రిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. సచిన్ రికార్డు బద్దలు

Published on Fri, 05/10/2024 - 22:30

గుజ‌రాత్ టైట‌న్స్ యువ సంచ‌ల‌నం సాయి సుద‌ర్శ‌న్ తొలి ఐపీఎల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సాయిసుద‌ర్శ‌న్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 

ఈ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చిన సుద‌ర్శ‌న్ సీఎస్‌కే బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. 

కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి స్కోర్‌ను బోర్డును ప‌రుగులు పెట్టించాడు. గిల్‌, సుదర్శన్ కలిసి తొలి వికెట్ కు 210 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్‌(104) కూడా సెంచరీ చేశాడు.

సచిన్ రికార్డు బద్దలు..
ఇక మ్యాచ్‌లో సుద‌ర్శ‌న్ సెంచ‌రీతో పాటు.. ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. త‌ద్వారా ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భార‌త ఆట‌గాడిగా సుదర్శన్ నిలిచాడు.

సాయి సుదర్శన్ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును చేరుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌, రుతురాజ్ గైక్వాడ్  పేరిట సంయుక్తంగా ఉండేది.

స‌చిన్‌, గైక్వాడ్ ఇద్ద‌రూ 1000 ప‌రుగుల మైలు రాయిని 31 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌తో వీరిద్దరి ఆల్‌టైమ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైల్‌స్టోన్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ క్రికెటర్‌ షాన్ మార్ష్ (21) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాత విండీస్ ఆటగాడు లెండిల్ సిమన్స్(23) సిమ్మన్స్ ఉన్నాడు.
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి