Breaking News

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్‌ షట్లర్‌

Published on Mon, 03/04/2024 - 21:59

హైదరాబాద్‌కు చెందిన స్టార్ షట్లర్ బి సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా ఇవాళ (మార్చి 4) వెల్లడించాడు. 31 ఏళ్ల సాయి ప్రణీత్‌ అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ఎన్ని పతకాలు సాధించిపెట్టాడు. 2019లో అతను వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌ అనంతరం గాయాలతో సతమతమైన ప్రణీత్‌.. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు.

ప్రణీత్‌ తన కెరీర్‌లో సింగపూర్‌ ఓపెన్‌, కెనడా ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ టైటిళ్లను సాధించాడు. కెరీర్‌ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రణీత్‌.. ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించలేకపోయానని బాధపడ్డాడు. ప్రణీత్‌ను భారత ప్రభుత్వం 2019లో అర్జున అవార్డుతో సత్కరించింది. ప్రణీత్‌ రిటైర్మెంట్‌ సందేశంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

ప్రణీత్‌ తన కెరీర్‌ మొత్తంలో 225 విజయాలు సాధించి, 151 పరాజయాలను ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 46 స్థానంలో ఉన్న ప్రణీత్‌.. 2019లో అత్యుత్తమంగా 10వ ర్యాంక్‌కు సాధించాడు. రిటైర్మెంట్‌ అనంతరం ‍ప్రణీత్‌ కోచ్‌గా సేవలించేందుకు ప్లాన్‌ చేసుకున్నాడు. యూఎస్‌లోని నార్త్‌ కరోలినా క్లబ్‌లో అతను కోచ్‌గా సేవలందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)