Breaking News

దేశానికి ఆడకుంటే...

Published on Fri, 06/20/2025 - 02:02

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ ఆటగాళ్లు దేశం తరఫున ఆడకపోతే ప్రోత్సాహకాల్ని తిరిగి రాబడతామని భారత స్పోర్ట్స్‌ అథారిటీ (సాయ్‌) స్పష్టం చేసింది. కొంతకాలంగా పేరొందిన ఆటగాళ్లు దేశాన్ని విస్మరించి ఏటీపీ టోర్నీలకే ప్రాధాన్యమివ్వడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సాయ్‌’... ఆటగాళ్లలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పథకాలు, ప్రోత్సాహకాల రూపేణా ఆర్థిక సాయం పొందిన ఆటగాళ్లు సహేతుక కారణాలు లేకుండా దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు నిరాకరిస్తే ఇచ్చిన మొత్తాన్ని వెనక్కి తీసుకుంటామని ప్రకటించింది. 

టార్గెట్‌ ఒలింపిక్‌ పొడియం పథకం (టాప్స్‌) ఎప్పటి నుంచో అమలవుతున్నప్పటికీ... ప్రత్యేకంగా ఆసియా క్రీడల్లో పతకాలే లక్ష్యంగా టార్గెట్‌ ఆసియా క్రీడల గ్రూప్‌ (టీఏజీజీ) పథకాన్ని కొత్తగా ఈ ఏడాదే తీసుకొచ్చింది. దీనికింద పలువురు ప్లేయర్లకు విదేశీ కోచ్‌లతో శిక్షణ, విదేశీ పర్యటనల కోసం భారత్‌ నిధులు మంజూరు చేస్తోంది. ఇలా పథకాలతో ఆర్థికసాయం, ప్రోత్సాహకాలు పొందిన ఆటగాళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. భారత మేటి సింగిల్స్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ డేవిస్‌ కప్‌ ఆడేందుకు అదేపనిగా ససేమిరా అంటున్నాడు. 

గతేడాది పాకిస్తాన్, స్వీడన్‌... ఈ ఏడాది టోగోతో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లు ఆడకుండా తప్పించుకున్నాడు. ఇలాగే శశికుమార్‌ ముకుంద్, యూకీ బాంబ్రీలు కూడా డేవిస్‌ కప్‌ పోటీలపై అనాసక్తి కనబరుస్తున్నారు. కానీ ఏటీపీ, గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు రాంకుమార్‌ రామనాథన్, శ్రీరామ్‌ బాలాజీ, సాకేత్‌ మైనేని, రిత్విక్‌ బొల్లిపల్లి, మహిళా ప్లేయర్లు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లి, వైదేహి చౌధరీ, రుతుజా, మాయా రాజేశ్వరన్‌లకు టీఏజీజీ కింద ఆర్థిక అండదండలు లభిస్తున్నాయి. ‘సాయ్‌’ తాజా నిర్ణయాన్ని అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) సహా డేవిస్‌ కప్‌ కెపె్టన్‌ రోహిత్‌ రాజ్‌పాల్, బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ కెప్టెన్‌ విశాల్‌ ఉప్పల్‌ స్వాగతించారు.   

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)