Breaking News

పాక్‌, ప్రోటీస్‌ కాదు.. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు చెరే జట్లు ఇవే: సచిన్‌

Published on Fri, 10/06/2023 - 12:06

క్రికెట్‌ అభిమానలు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్‌-2023కు గురువారం(ఆక్టోబర్‌ 5) తెరలేచింది. అహ్మాదాబాద్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌కు చెరే నాలుగు జట్లను భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కకర్‌ ఎంచుకున్నాడు. భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లను సెమీఫైనల్‌ ఫేవరేట్‌లగా 'మాస్టర్‌ బ్లాస్టర్‌' ఎంపిక చేశాడు.

"భారత జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అదే విధంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టు కూడా చాలా సమతుల్యంగా ఉంది. కచ్చితంగా టీమిండియా సెమీస్‌కు చేరుతోంది. అదే విధంగా ఆస్ట్రేలియా కూడా అ‍త్యుత్తమంగా ఉంది. కాబట్టి వారు సెమీఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక మూడో జట్టుగా డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ఇంగ్లండ్‌ కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లీష్‌ జట్టు కూడా మరోసారి టైటిల్‌ బరిలో ఉంటుంది.

ఇంగ్లండ్‌ జట్టులో హ్యారీ బ్రూక్‌, సామ్‌ కుర్రాన్‌ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇక నా నాల్గువ జట్టు న్యూజిలాండ్‌. కివీస్‌ వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేరింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో న్యూజిలాండ్ ఎల్లప్పుడూ బాగా రాణిస్తుంది. కివీస్‌ కూడా కచ్చితంగా టాప్‌-4లో ఉంటుందని" ఐసీసీ డిజిటిల్‌ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్‌ పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్‌ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి?

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు