Breaking News

వినేశ్‌కు రజతం ఇవ్వాలి: సచిన్‌ టెండూల్కర్‌

Published on Sat, 08/10/2024 - 08:52

పారిస్‌ ఒలింపిక్స్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలేనని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. మహిళల 50 కేజీల విభాగంలో వరస విజయాలతో ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌.. వంద గ్రాములు అదనపు బరువు కారణంగా పతకానికి దూరమై రెజ్లింగ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.

ఈ నేపథ్యంలో సచిన్‌ సోషల్‌ మీడియాలో స్పందించాడు. ‘ప్రతి ఆటలో నిబంధనలు ఉంటాయి. వాటిని సందర్భానుసారంగా చూడాలి. అవసరమైతే మార్పులు చేయాలి. వినేశ్‌ చక్కటి ఆటతీరుతో ఫైనల్‌కు చేరింది. తుదిపోరుకు ముందు అదనపు బరువు కారణంగా అనర్హత వేటు పడి రజత పతకానికీ దూరమైంది. 

దీనికి సరైన కారణం కనిపించడం లేదు. ఇందులో క్రీడా స్ఫూర్తి లోపించినట్లే’ అని సచిన్‌ ఎక్స్‌లో పేర్కొన్నాడు. డ్రగ్స్‌ వంటి అనైతిక చర్యలతో అనర్హతకు గురై ఉంటే చివరి స్థానం ఇవ్వడం సబబే అని.. కానీ వినేశ్‌ న్యాయంగా పోరాడి ఫైనల్‌కు చేరిందని సచిన్‌ గుర్తు చేసుకున్నాడు. 

ఫొగాట్‌ రజత పతకానికి అర్హురాలే అని.. కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ (సీఏఎస్‌) తీర్పు తర్వాత అయినా వినేశ్‌కు పతకం వస్తుందని ఆశిస్తున్నట్లు సచిన్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నాడు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)