Breaking News

WC 2011: నాడు కోహ్లికి నేను ఏం చెప్పానంటే: సచిన్‌ టెండుల్కర్‌

Published on Sat, 04/22/2023 - 14:58

Sachin Tendulkar- Virat Kohli- ICC World Cup 2011 Final: భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌-2011 ట్రోఫీని ధోని సారథ్యంలోని టీమిండియా ముద్దాడిన దృశ్యాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంక.. భారత్‌ ముందు 275 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

సెహ్వాగ్‌, సచిన్‌ త్వరత్వరగా
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను శ్రీలంక దిగ్గజ పేసర్‌ లసిత్‌ మలింగ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(0), సచిన్‌ టెండ్కులర్‌(18)ను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం గౌతం గంభీర్‌(97), ధోని(91) అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిసి భారత్‌కు రెండో సారి వన్డే ప్రపంచకప్‌ను అందించారు. 

నాడు కోహ్లికి ఏం చెప్పారు?
ఇదిలా ఉంటే.. సచిన్‌ పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో బ్యాటింగ్‌కు వస్తున్న విరాట్‌ కోహ్లితో ముచ్చటించిన విషయం క్రికెట్‌ ప్రేమికులకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆనాటి ఆ ఘటన గురించి చెప్పమని ఓ నెటిజన్‌ సచిన్‌ టెండుల్కర్‌ను ఆడిగాడు. 

బంతి కాస్త స్వింగ్‌ అవుతోంది
ఆస్క్‌ సచిన్‌ సెషన్‌లో భాగంగా శుక్రవారం ఈ మేరకు ప్రశ్న ఎదురుకాగా.. "బంతి కొద్దిగా స్వింగ్ అవుతోంది, జాగ్రత్త" అని చెప్పానంటూ సచిన్‌ బదులిచ్చాడు. ఇక సచిన్‌ అవుటైన తర్వాత నాడు క్రీజులోకి వచ్చిన కోహ్లి గంభీర్‌తో కలిసి 83 పరుగుల కీలక  భాగస్వామ్యం నెలకొల్పాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌.. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దిల్షాన్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక యువరాజ్‌ సింగ్‌తో కలిసి ధోని ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి భారత్‌ను విజయతీరాలకు చేర్చి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

సుదీర్ఘ నిరీక్షణకు ఆరోజుతో తెర
ఇక 2011, ఏప్రిల్‌ 2న భారత్‌ మరోసారి ప్రపంచ విజేతగా నిలవడంతో తన సుదీర్ఘ కెరీర్‌లో ఐసీసీ టైటిల్‌ లేదన్న సచిన్‌ టెండుల్కర్‌ నిరీక్షణకు తెరపడింది. ఆరోసారి ప్రపంచకప్‌ బరిలోకి దిగిన అతడి ఖాతాలో టైటిల్‌ చేరింది.

ఈ నేపథ్యంలో చాంపియన్‌గా అవతరించిన అనంతరం ఈ టీమిండియా దిగ్గజాన్ని భుజాలపై ఊరేగిస్తూ సహచర ఆటగాళ్లు అతడికి సముచిత గౌరవం ఇచ్చారు. నాటి ఆ దృశ్యాలు ఇప్పటికీ క్రికెట్‌ ప్రేమికుల మనసులో మెదలుతూనే ఉంటాయి.

చదవండి: పంజాబ్‌తో మ్యాచ్‌..ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్‌! మరి రోహిత్‌?
నువ్వేమీ ముసలోడివి కాలేదు!; సచిన్‌లా 16 ఏళ్లకే ఆట మొదలెడితే: ధోని

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)