Breaking News

సబలెంక శుభారంభం

Published on Sun, 11/03/2024 - 04:18

రియాద్‌: మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అరైనా సబలెంక (బెలారస్‌) శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్‌ పోరులో సబలెంక 6–3, 6–4తో చైనా స్టార్, ఏడో సీడ్‌ జెంగ్‌ కిన్‌వెన్‌ను వరుససెట్లలో ఓడించింది. రెండు సెట్లలోనూ టాప్‌సీడ్‌ జోరుకు ఎదురే లేకుండాపోయింది. చైనా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంక గంటా 24 నిమిషాల్లో మ్యాచ్‌ గెలిచింది. 

నంబర్‌వన్‌ ప్లేయర్‌ 3 ఏస్‌లు సంధించి ఒకే ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ చేయగా,  జెంగ్‌ కిన్‌వెన్‌ 4 డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 8 ఏస్‌లు సంధించినప్పటికీ టాప్‌సీడ్‌ జోరుకు  చతికిలబడింది. ఓవరాల్‌గా వీళ్లిద్దరు ముఖాముఖిగా తలపడిన ఐదుసార్లు కూడా బెలారస్‌ స్టారే విజయం సాధించింది. ఈ ఏడాదే నాలుగుసార్లు చైనా ప్రత్యర్థిని ఓడించింది. 

ఈ సీజన్‌లో ఆ్రస్టేలియా ఓపెన్‌ ఫైనల్లో కిన్‌వెన్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన సబలెంక... యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో చైనా ప్లేయర్‌కు ఇంటిదారి చూపింది. ఇటీవల సొంతగడ్డ వూహాన్‌లోనూ కిన్‌వెన్‌కు సబలెంక చేతిలో నిరాశే ఎదురైంది. ఈ గ్రూప్‌లోని తర్వాతి రెండు మ్యాచ్‌లలో జాస్మిన్‌ పావొలిని, ఎలెనా రైబాకినాలపై గెలిస్తే సబలెంక వరల్డ్‌ నంబర్‌వన్‌ స్థానానికి ఎలాంటి ఢోకా ఉండదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)