Breaking News

ప్రిక్వార్టర్స్‌లో సబలెంక, స్వియాటెక్‌

Published on Sat, 05/31/2025 - 02:13

పారిస్‌: ప్రపంచ నంబర్‌వన్‌ అరియాన సబలెంక, డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టారు. వీరిద్దరితో పాటు నాలుగో సీడ్‌ పావొలిని, ఎనిమిదో సీడ్‌ క్విన్‌వెన్‌ జెంగ్, 12వ సీడ్‌ రిబాకినాలు కూడా ప్రిక్వార్టర్స్‌ చేరారు. పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్‌ లారెంజో ముసెట్టి, పదో సీడ్‌ హోల్గర్‌ రూన్‌లు కూడా ప్రిక్వార్టర్స్‌ సమరానికి అర్హత సంపాదించారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ తన అమెరికన్‌ భాగస్వామితో కలిసి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. 

అలవోక విజయంతో... 
మహిళల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌ పోటీల్లో నిరుటి క్వార్టర్‌ ఫైనలిస్ట్, తాజా ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ రన్నరప్‌ సబలెంక (బెలారస్‌) 6–2, 6–3తో సెర్బియన్‌ ప్లేయర్‌ ఓల్గా డానిలోవిచ్‌ అలవోక విజయం సాధించింది. కేవలం గంటా 19 నిమిషాల్లోనే సెర్బియన్‌ ప్రత్యర్థి ఆట కట్టించింది. గతేడాది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దాకా పోరాడిన ఓల్గా ఈసారి మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో  హ్యాట్రిక్‌ చాంపియన్‌ (2022, 2023, 2024), పోలండ్‌ స్టార్‌ స్వియాటెక్‌ వరుసగా నాలుగో టైటిల్‌ దిశగా అడుగులు వేస్తోంది. 

మూడో రౌండ్లో ఐదో సీడ్‌ స్వియాటెక్‌ 6–2, 7–5తో జాక్వెలైన్‌ క్రిస్టిన్‌ (రొమేనియా)పై గెలుపొందగా, నిరుటి రన్నరప్, నాలుగో సీడ్‌ జాస్మిన్‌ పావొలిని (ఇటలీ) 6–4, 6–1తో ఉక్రెయిన్‌కు చెందిన యులియా స్టారొడుత్సెవాను ఓడించింది. 12వ సీడ్‌ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌) 6–2, 6–2తో జెలీనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలుపొందగా, ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మాజీ రన్నరప్, చైనా స్టార్‌ క్విన్‌వెన్‌ జెంగ్‌ 6–3, 6–4తో విక్టోరియా ఎం»ొకొ (కెనడా)పై విజయం సాధించింది.  

చెమటోడ్చిన రూన్‌ 
పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో హోల్గర్‌ రూన్‌ (డెన్మార్క్‌) 4–6, 6–2, 5–7, 7–5, 6–2తో క్వెంటిన్‌ హలైస్‌ (ఫ్రాన్స్‌)పై చెమటోడ్చి నెగ్గాడు. ఎనిమిదో సీడ్‌ లారెంజో ముసెట్టి (ఇటలీ) 4–6, 6–4, 6–3, 6–2తో మరియానో నెవొన్‌ (అర్జెంటీనా) గెలుపొందగా, 12వ సీడ్‌ టామీ పాల్‌ (అమెరికా) 6–3, 3–6, 7–6 (9/7), 3–6, 6–3తో కరెన్‌ కచనొవ్‌ (రష్యా)పై పోరాడి గెలిచాడు. 

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యూ­కీ జోడీ 
భారత డబుల్స్‌ టెన్నిస్‌ స్టార్‌ యూకీ బాంబ్రీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్లో యూకీ–గాలోవే (అమెరికా) ద్వయం 6–7 (4/7), 7–6 (7/4), 6–3తో ఏడో సీడ్‌ నికోల మెక్టిక్‌ (క్రొయేషియా)–మైకేల్‌ వీనస్‌ (ఆ్రస్టేలియా) జంటపై ఆఖరిదాకా పోరాడి గెలిచింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యూకీ–గాలోవే జోడీ... అమెరికాకు చెందిన తొమ్మిదో సీడ్‌ క్రిస్టిన్‌ హ్యరీసన్‌– ఇవాన్‌ కింగ్‌ జంటతో తలపడుతుంది. 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)