Breaking News

సబలెంకా X రిబాకినా

Published on Fri, 01/30/2026 - 04:00

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారస్‌) వరుసగా నాలుగో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2023, 2024లలో టైటిల్‌ సాధించిన ఆమె గత ఏడాది మాడిసన్‌ కీస్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. గురువారం జరిగిన తొలి సెమీఫైనల్లో సబలెంకా 6–2, 6–3తో 12వ సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌)పై గెలిచింది. 

76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా 29 విన్నర్స్‌ కొట్టి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ రిబాకినా (కజకిస్తాన్‌)తో సబలెంకా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో రిబాకినా 6–3, 7–6 (9/7)తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ జెస్సికా పెగూలా (అమెరికా)పై విజయం సాధించింది. 

1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిబాకినా ఆరు ఏస్‌లు సంధించింది. 31 విన్నర్స్‌ కొట్టిన ఆమె తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లో సబలెంకా, రిబాకినా తలపడనుండటం ఇది రెండోసారి. 2023 ఫైనల్లో రిబాకినాపైనే గెలిచి సబలెంకా తొలిసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చాంపియన్‌గా అవతరించింది.  

3 ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ చరిత్రలో వరుసగా నాలుగేళ్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫైనల్‌ చేరిన మూడో క్రీడాకారిణి సబలెంకా. గతంలో ఇవోన్‌ గూలాగాంగ్‌ (ఆ్రస్టేలియా; 1971 నుంచి 1976 వరకు), మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌; 1997 నుంచి 2002 వరకు) వరుసగా ఆరుసార్లు ఫైనల్‌ చేరారు.

నేడు పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌ 
అల్‌కరాజ్‌ x జ్వెరెవ్‌ (ఉదయం 9 నుంచి)
జొకోవిచ్‌x సినెర్‌ (మధ్యాహ్నం 2 నుంచి)
సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం 

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)