Breaking News

రాణించిన కిల్లర్‌ మిల్లర్‌.. రాయల్స్‌కు హ్యాట్రిక్‌ విక్టరీ

Published on Tue, 01/21/2025 - 10:45

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) పార్ల్‌ రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌తో నిన్న (జనవరి 20) జరిగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో రాయల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాయల్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. రాయల్స్‌ చేతిలో ఓడిన సూపర్‌ కింగ్స్‌ 5 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచిన ఎంఐ కేప్‌టౌన్‌ రెండో స్థానంలో ఉంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సూపర్‌ కింగ్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేసిందంటే అది జానీ బెయిర్‌స్టో పుణ్యమే. బెయిర్‌స్టో 40 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేశాడు. ఆఖర్లో డొనొవన్‌ ఫెరియెరా (19 బంతుల్లో 32 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. రాయల్స్‌ బౌలర్లలో ఫోర్టుయిన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, జో రూట్‌, డేవిడ్‌ గేలియమ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం 147 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. మిచెల్‌ వాన్‌ బెర్రెన్‌ (44), కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ (40 నాటౌట్‌) రాణించి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చారు. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో డ్రి ప్రిటోరియస్‌ 27 పరుగులు చేయగా.. జో రూట్‌ 6, రూబిన్‌ హెర్మన్‌ 19 పరుగులకు ఔటయ్యారు. మిల్లర్‌కు జతగా దినేశ్‌ కార్తీక్‌ (2) అజేయంగా నిలిచాడు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో హర్డస్‌ సిపామ్లా 2, ఇమ్రాన్‌ తాహిర్‌, ఫెరియెరా తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)