రాయల్స్‌ ఓపెనర్‌ విధ్వంసం.. మార్క్రమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృధా

Published on Sun, 01/12/2025 - 13:09

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20 2025) నిన్న (జనవరి 11) రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌పై పార్ల్‌ రాయల్స్‌ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్‌ మార్క్రమ్‌ 49 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

జోర్డన్‌ హెర్మన్‌ 10, జాక్‌ క్రాలే 27, టామ్‌ ఏబెల్‌ 20, మార్కో జన్సెన్‌ 4, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 28 (నాటౌట్‌) పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో క్వేనా మపాకా, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ 18.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ లుహాన్‌ డ్రే ప్రిటోరియస్‌ (51 బంతుల్లో 97; 10 ఫోర్లు, 6 సిక్సర్లు) రాయల్స్‌ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మరో ఓపెనర్‌ జో రూట్‌ 44 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. రూట్‌కు కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ (17 నాటౌట్‌) సహకరించాడు. రాయల్స్‌ కోల్పోయిన ఏకైక వికెట్‌ మార్కో జన్సెన్‌కు దక్కింది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను చిత్తు చేసిన సూపర్‌ కింగ్స్‌
నిన్ననే జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌పై జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ కేప్‌టౌన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. 

లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు జార్జ్‌ లిండే (48 నాటౌట్‌), డెలానో పాట్‌గెటర్‌ (44 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఎంఐ ఈ మాత్రమే స్కోరైనా చేయగలిగింది. కేప్‌టౌన్‌ 75 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోగా.. లిండే, పాట్‌గెటర్‌ తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు. జోబర్గ్‌ సూపర్ కింగ్స్‌ బౌలర్లలో తబ్రేజ్‌ షంషి, డేవిడ్‌ వీస​్‌, సిపామ్లా, ఈవాన్‌ జోన్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్‌కు వర్షం పలుమార్లు అడ్డుతగిలింది. 11.3 ఓవర్ల అనంతరం మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన సూపర్‌ కింగ్స్‌ను విజేతగా ప్రకటించారు. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి సూపర్‌ కింగ్స్‌ 3 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. 

సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో డెవాన్‌ కాన్వే 9, డుప్లెసిస్‌ 30, లుస్‌ డు ప్లూయ్‌ 24 (నాటౌట్‌), జానీ బెయిర్‌స్టో 14 పరుగులు చేశారు. సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఎంఐ బౌలర్లలో రబాడకు రెండు, ట్రెంట్‌ బౌల్ట్‌కు ఓ వికెట్‌ దక్కాయి. 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)