Breaking News

రాణించిన రబాడ.. ముంబై ఇండియన్స్‌ ఘన విజయం

Published on Tue, 01/14/2025 - 11:09

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025లో ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ రెండో విజయం నమోదు చేసింది. పార్ల్‌ రాయల్స్‌తో నిన్న (జనవరి 13) జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ కేప్‌టౌన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్‌ (37 బంతుల్లో 59; 8 ఫోర్లు, సిక్స్‌) అర్ద సెంచరీతో రాణించాడు. రస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. 

ఆఖర్లో డెలానో పాట్‌గెటర్‌ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. కేప్‌టౌన్‌ ఇన్నింగ్స్‌లో ర్యాన్‌ రికెల్టన్‌ 8, కొలిన్‌ ఇంగ్రామ్‌ 7, జార్జ్‌ లిండే 1, జూనియర్‌ ఏబీడి 14, అజ్మతుల్లా 2 (నాటౌట్‌) పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో గాలిమ్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ఫోర్టుయిన్‌, మఫాకా, ముజీబ్‌ ఉర్‌ రెహ్మన్‌, లుంగి ఎంగిడి తలో వికెట్‌ దక్కించుకున్నారు.


173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు డ్రి ప్రిటోరియస్‌ (26), జో రూట్‌ (26), వన్‌డౌన్‌ బ్యాటర్‌ సామ్‌ హెయిన్‌ (20), ముజీబ్‌ రెహ్మాన్‌ (34), మఫాకా (22 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ లీగ్‌లో ఆడుతున్న ఏకైక భారతీయుడు దినేశ్‌ కార్తీక్‌ దారుణంగా విఫలమయ్యాడు. డీకే 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ (1) కూడా నిరాశపరిచాడు. 

ఎంఐ బౌలర్లలో జార్జ్‌ లిండే 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ తలో రెండు, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. రబాడ అద్భుతమైన స్పెల్‌ వేశాడు. తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌ చేసి రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్‌ విన్నింగ్‌ స్పెల్‌ వేసిన రబాడకే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)