మిల్లర్‌ కిల్లర్‌ ఇన్నింగ్స్‌.. నిప్పులు చెరిగిన ఎంగిడి

Published on Mon, 01/15/2024 - 10:09

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా నిన్న (జనవరి 14) జరిగిన హై స్కోరింగ్‌ మ్యాచ్‌లో పార్ల్‌ రాయల్స్‌ ఆటగాళ్లు చెలరేగిపోయాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత రాయల్స్‌ బ్యాటర్లు డేవిడ్‌ మిల్లర్‌ (42 బంతుల్లో 75 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), వాన్‌ బురెన్‌ (40 బంతుల్లో 72 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్‌) విజృంభించగా.. ఆతర్వాత బౌలింగ్‌లో లుంగి ఎంగిడి (4-0-39-4) నిప్పులు చెరిగాడు. ఫలితంగా రాయల్స్‌ 10 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌.. మిల్లర్‌, బురెన్‌, బట్లర్‌ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో జేసన్‌ రాయ్‌ (5), విహాన్‌ లుబ్బే (12) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో డుపవిల్లోన్‌, జేమ్స్‌ నీషమ్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఛేదనలో క్యాపిటల్స్‌ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ.. లుంగి ఎంగిడి (4/39) ధాటికి ఓడక తప్పలేదు. ఎంగిడి నిప్పులు చెరిగే బంతులతో వికెట్లు తీసి క్యాపిటల్స్‌ పతనాన్ని శాశించాడు. విల్‌ జాక్స్‌ (34 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిలీ రొస్సో (45 బంతుల్లో 82; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), నీషమ్‌ (9 బంతుల్లో 20; 4 ఫోర్లు) క్యాపిటల్స్‌ను గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. క్యాపిటల్స్‌ హిట్టర్లు ఫిల్‌ సాల్ట్‌ (0), డి బ్రూయిన్‌ (4), కొలిన్‌ ఇన్‌గ్రామ్‌ (1) నిరాశపరిచారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)