Breaking News

సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ మెరుపు శతకం.. పోరాడి ఓడిన ముంబై

Published on Wed, 01/17/2024 - 11:34

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర సమరం జరిగింది. ముంబై కేప్‌టౌన్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 4 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ చేసినప్పటకీ.. ముంబై ఆటగాళ్లు గట్టిగా పోరాడటంతో మ్యాచ్‌ చివరి బంతి వరకు సాగింది.

సన్‌రైజర్స్‌ బౌలర్‌ ఒట్నీల్‌ (4-0-35-3) బార్ట్‌మన్‌ చివరి ఓవర్‌ అద్భుతంగా బౌల్‌ చేసి ముంబై గెలుపును అడ్డుకున్నాడు. ముంబై చివరి ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒట్నీల్‌ ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి సన్‌రైజర్స్‌ను గెలిపించాడు. 

బ్యాటింగ్‌లో ఓపెనర్‌ జోర్డన్‌ హెర్మన్‌ (62 బంతుల్లో 106; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ మెరుపు శతకంతో చెలరేగడంతో సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ (37 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో పోలార్డ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం ఛేదనకు దిగిన ముంబై.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులకే పరిమతమై స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. వాన్‌ డర్‌ డస్సెన్‌ (41), ర్యాన్‌ రికెల్టన్‌ (58), సామ్‌ కర్రన్‌ (37 నాటౌట్‌), కీరన్‌ పోలార్డ్‌ (24) ముంబైను గెలిపించేందుకు విఫల యత్నం చేశారు. ఒట్నీల్‌ బార్ట్‌మన్‌ (3/35) ముంబైని దెబ్బకొట్టాడు. డేనియల్‌ వారెల్‌, లియామ్‌ డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)