Breaking News

SA20, 2024: డుప్లెసిస్‌ ఊచకోత.. 34 బంతుల్లోనే..!

Published on Tue, 01/30/2024 - 09:56

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2024లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లోనే అజేయ అర్ధశతకం (4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాది తన జట్టును గెలిపించాడు. ఫలితంగా సూపర్‌ కింగ్స్‌ 34 బంతుల్లోనే ఎంఐ కేప్‌టౌన్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించి, 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేప్‌టౌన్‌.. కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ (10 బంతుల్లో 33 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) చెలరేగడంతో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. వాన్‌ డర్‌ డస్సెన్‌ (16), రికెల్టన్‌ (16 బంతుల్లో 23) రెండంకెల స్కోర్లు చేయగా.. లివింగ్‌స్టోన్‌ 3 పరుగులకే ఔటయ్యాడు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో ఇమ్రాన్‌ తాహిర్‌ 2, లిజాడ్‌ విలియమ్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం లక్ష్య ఛేదన సమయంలో వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన సూపర్‌ కింగ్స్‌ లక్ష్యాన్ని 98 పరుగులకు మార్చారు. లక్ష్యం పెద్దది కావడంతో ఓపెనర్లు డుప్లెసిస్‌,  డు ప్లూయ్‌ (14 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సూపర్‌ కింగ్స్‌ 5.4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. వరుస ఓటములతో సతమతమవుతున్న సూపర్‌ కింగ్స్‌కు ఇది ఊరట కలిగించే విజయం. 

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)