Breaking News

అగ్రపీఠాన్ని మరింత సుస్థిరం చేసుకున్న సూర్యకుమార్‌

Published on Wed, 12/13/2023 - 15:27

భారత టీ20 జట్టు తాత్కాలిక సారధి సూర్యకుమార్‌ యాదవ్‌ పొట్టి ఫార్మాట్‌లో తన బ్యాటింగ్‌ అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో నిన్న (డిసెంబర్‌ 12) జరిగిన రెండో టీ20లో మెరుపు అర్ధసెంచరీ (36 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించిన స్కై.. 10 రేటింగ్‌ పాయింట్లు అదనంగా కూడగట్టుకుని, తన సమీప ప్రత్యర్ధులందరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడు.

ప్రస్తుతం స్కై ఖాతాలో 865 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న మొహమ్మద్‌ రిజ్వాన్‌ ఖాతాలో 787 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం​ 78 పాయింట్లుగా ఉంది. టాప్‌ 10 ర్యాంకింగ్స్‌లో స్కై తర్వాత 700కు పైగా పాయింట్లు కేవలం ముగ్గురు ఆటగాళ్లకు మాత్రమే ఉన్నాయి. రిజ్వాన్‌ 787, మార్క్రమ్‌ 758, బాబర్‌ ఆజమ్‌ 734 పాయింట్లు కలిగి ఉన్నారు.

టాప్‌-10 ఉన్న మరో భారత ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ (ఏడో ర్యాంక్‌) అనారోగ్యం కారణంగా సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడలేకపోవడంతో అతని ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. సూర్యకుమార్‌ ప్రస్తుత ఫామ్‌ను మరికొద్ది రోజుల పాటు కొనసాగించగలిగితే టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టాప్‌ ర్యాంకింగ్‌ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడు. 

మరోవైపు సౌతాఫ్రికాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ధసెంచరీతో విరుచుకుపడిన రింకూ సింగ్‌ ఏకంగా 46 స్థానాలు మెరుగుపర్చుకుని 59వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన తిలక్‌ వర్మ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 55వ  ప్లేస్‌కు చేరాడు. 

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. పొట్టి ఫార్మాట్‌లో ఇటీవలే టాప్‌ ర్యాంక్‌ దక్కించుకున్న భారత అప్‌కమింగ్‌ స్పిన్నర్‌ రవి భిష్ణోయ్‌.. సౌతాఫ్రికాతో రెండో టీ20 ఆడే అవకాశం రాకపోవడంతో ఎలాంటి రేటింగ్‌ పాయింట్లు సాధించలేకపోయాడు. ప్రస్తుతానికి రవి తన టాప్‌ ర్యాంక్‌ను కాపాడుకున్నప్పటికీ.. ఆఫ్ఘన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ రూపంలో అతనికి ప్రమాదం పొంచి ఉంది.

ప్రస్తుతం ఈ ఇద్దరు బౌలర్లు సమానంగా 692 రేటింగ్‌ పాయింట్లు కలిగి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. టాప్‌ 10లో రవి మినహా భారత్‌ నుంచి ఎవ్వరికీ ప్రాతినిథ్యం లభించకపోగా.. హసరంగ, ఆదిల్‌ రషీద్‌, తీక్షణ​, సామ్‌ కర్రన్‌, ఫజల్‌ హక్‌ ఫారూకీ, ముజీబ్‌, అకీల్‌ హొసేన్‌, తబ్రేజ్‌ షంషి వరుసగా 3 నుంచి 10 స్థానాలో​ నిలిచారు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)