Breaking News

జట్టు నిండా విధ్వంసకర వీరులే... కట్‌ చేస్తే 78 పరుగులకే ఆలౌట్‌

Published on Thu, 02/01/2024 - 11:09

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో జోబర్గ్ సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బుధవారం జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని సూపర్ కింగ్స్ చవిచూసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి కేవలం 78 పరుగులకే కుప్పకూలింది.

జోబర్గ్ బ్యాటర్లలో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. మాడ్సెన్ ఒక్కడే 32 పరుగులతో పర్వాలేదన్పించాడు. జో బర్గ్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌, రెజా హెండ్రిక్స్, మొయిన్‌ అలీ వంటి విధ్వంసకర ఆటగాళ్లు కనీసం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు.

సన్‌రైజర్స్ బౌలర్లలో డానియల్‌ వోరల్, కుర్గర్‌ తలా 3 వికెట్లతో జోబర్గ్‌ పతనాన్ని శాసించగా.. స్వాన్‌పోయెల్, జానెసన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ..11 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో డేవిడ్‌ మలాన్‌(40 నాటౌట్‌), టామ్‌ అబెల్‌(26) పరుగులతో మ్యాచ్‌ ఫినిష్‌ చేశారు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. సర్ఫరాజ్‌కు ఛాన్స్‌! సిరాజ్‌కు నో ప్లేస్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)