Breaking News

సౌతాఫ్రికా ఓపెన‌ర్ ఊచ‌కోత‌.. 7 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో! అయినా పాపం

Published on Thu, 07/18/2024 - 10:35

మేజర్ లీగ్ క్రికెట్ 2024లో సీటెల్ ఓర్కాస్ వ‌రుస‌గా మూడో ఓట‌మి చ‌వి చూసింది. ఈ లీగ్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓర్కాస్ ప‌రాజ‌యం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగులు చేసింది.

ఓర్కాస్ బ్యాట‌ర్లంతా విఫ‌ల‌మైన‌ప్ప‌ట‌కి ఆ జ‌ట్టు ఓపెన‌ర్‌, ద‌క్షిణాఫ్రికా స్టార్ ర్యాన్ రికెల్టన్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. రికెల్టన్ నైట్ రైడ‌ర్స్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఈ  మ్యాచ్‌లో 52 బంతులు ఎదుర్కొన్న రికెల్ట‌న్‌.. 7 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 89 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.

నైట్‌రైడ‌ర్స్ బౌల‌ర్ల‌లో జాన్స‌న్‌, ర‌స్సెల్‌, న‌రైన్‌, డ్రై త‌లా వికెట్ సాధించారు. అనంత‌రం 143 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన నైట్‌రైడ‌ర్స్‌.. 19.1 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నైట్‌రైడ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో భార‌త మాజీ అండ‌ర్‌-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు.

47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 62 ప‌రుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. అత‌డితో పాటు జాస‌న్ రాయ్ 27 ప‌రుగుల‌తో రాణించాడు. సీటెల్ ఓర్కాస్ బౌల‌ర్ల‌లో గ‌నూన్‌, హార్మ‌త్ సింగ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఎంగిడీ, కీమో పాల్ చెరో వికెట్ సాధించారు. ఏదమైన‌ప్ప‌ట‌కి సీటెల్ ఓర్కాస్ ఓట‌మి పాలవ్వ‌డంతో ర్యాన్ రికెల్టన్ అద్భుత ఇన్నింగ్స్ వృథాగా మిగిలిపోయింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)