Breaking News

ఫాప్‌, కోహ్లి విధ్వంసం.. గుజ‌రాత్‌పై ఆర్సీబీ ఘ‌న విజ‌యం

Published on Sat, 05/04/2024 - 23:02

ఐపీఎల్‌-2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా నిలుపున్‌కుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘ‌న విజ‌యం సాధించింది. 

ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆర్సీబీ ఏడో స్ధానానికి చేరుకుంది. ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ నామ‌మాత్ర‌పు స్కోరుకే ప‌రిమిత‌మైంది.

19.3 ఓవ‌ర్ల‌లో 147 ప‌రుగులకు గుజ‌రాత్ ఆలౌటైంది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో షారూఖ్ ఖాన్ (37), డేవిడ్ మిల్ల‌ర్(30), రాహుల్ తెవాటియా(35) ప‌ర్వాలేద‌న్పించారు. 

ఇక ఆర్సీబీ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్‌, విజ‌య్ కుమార్‌, య‌శ్ ద‌యాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రీన్‌, కరణ్ చెరో వికెట్ సాధించారు. అనంత‌రం 148 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 13.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని చేధించింది.

ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్‌(23 బంతుల్లో 64), విరాట్ కోహ్లి(27 బంతుల్లో 42) ప‌రుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడారు. ఆ త‌ర్వాత దినేష్ కార్తీక్‌(21 నాటౌట్‌),  స్వ‌ప్నిల్ సింగ్‌(15) ప‌రుగుల‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో లిటిల్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. నూర్ ఆహ్మ‌ద్ రెండు వికెట్లు సాధించాడు.

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)