Breaking News

ఆస్ట్రేలియన్ ఓపెన్ లో బోపన్న సరికొత్త చరిత్ర..

Published on Sat, 01/27/2024 - 19:50

ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత వెటరన్‌  రోహన్ బోపన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు. 43 ఏళ్ల బోపన్న.. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌-2024 పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల డబుల్స్ ఫైనల్లో రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6 (7-0), 7-5తో ఇటలీ ద్వయం సిమోన్ బొలెల్లి- ఆండ్రియా వావోసోరిపై విజయం సాధించింది. రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.

ఈ విజయంతో ఓ అరుదైన ఘనతను బోపన్న తన పేరిట లిఖించుకున్నాడు. టెన్నిస్‌ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ గెలిచిన అతి పెద్ద వయసు ఆటగాడిగా రోహన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు అమెరికా టెన్నిస్‌ ప్లేయర్‌ మైక్‌ బ్రియాన్‌ (41 ఏండ్ల 76 రోజులు) పేరిట ఉండేది. తాజా విజయంతో బోపన్న(43 ఏళ్ల 329 రోజులు) మైక్‌ బ్రియాన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.

ఇక అద్బుత విజయం అందుకున్న బోపన్న-ఎబ్డెన్‌ల జోడీకి ట్రోఫీతో పాటు రూ.6.06 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. మరోవైపు  మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను అరియానా సబలెంకా  సొంతం చేసుకుంది. ఫైనల్లో చైనాకు చెందిన ఝెంగ్ కిన్వెన్‌ను  6-3, 6-2తో సబలెంకా చిత్తు చేసింది.
చదవండి: ENG Vs IND 1st Test: ఎంత పని చేశావు భరత్‌.... కోపంతో ఊగిపోయిన బుమ్రా! వీడియో వైరల్‌

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)