Breaking News

భళా బోపన్న...

Published on Tue, 09/30/2025 - 01:02

టోక్యో: వయసు ఒక అంకె మాత్రమేనని... ఆడాలన్న ఉత్సాహం, గెలవాలన్న కసి ఉంటే... నాలుగు పదులు దాటినా అద్భుతాలు సాధించవచ్చని భారత టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న మరోసారి నిరూపించాడు. జపాన్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నీలో జపాన్‌ ప్లేయర్‌ టకెరు యుజుకితో కలిసి 45 ఏళ్ల రోహన్‌ బోపన్న డబుల్స్‌ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తద్వారా ఏటీపీ–500 టోర్నీల చరిత్రలో ఫైనల్‌కు చేరిన అతిపెద్ద వయసు్కడిగా బోపన్న గుర్తింపు పొందాడు. 

సోమవారం జరిగిన సెమీఫైనల్లో బోపన్న–టకెరు ద్వయం 4–6, 6–3, 18–16తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో టాప్‌ సీడ్‌ క్రిస్టియన్‌ హ్యారీసన్‌–ఇవాన్‌ కింగ్‌ (అమెరికా) జోడీని బోల్తా కొట్టించింది. 94 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జంట ‘సూపర్‌ టైబ్రేక్‌’లో మూడు మ్యాచ్‌ పాయింట్లను కాచుకొని గెలుపొందడం విశేషం. ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఒకదశలో 1–4తో వెనుకబడ్డ ఈ ఇండో–జపాన్‌ ద్వయం ఆ తర్వాత 8–9 వద్ద... 9–10 వద్ద... 12–13 వద్ద మూడుసార్లు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని గట్టెక్కింది. 

ఎనిమిది ఏస్‌లు సంధించిన బోపన్న–టకెరు మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌ను ఒకసారికోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేశారు. నేడు జరిగే ఫైనల్లో హుగో నిస్‌ (మొనాకో)–ఎడువార్డ్‌ రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌)లతో బోపన్న–టకెరు తలపడతారు.

64 బోపన్న తన కెరీర్‌లో ఇప్పటి వరకు 64 టోర్నీలలో డబుల్స్‌ విభాగంలో ఫైనల్‌కు చేరాడు. ఇందులో 26 సార్లు గెలిచి విజేతగా... 37 సార్లు ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)