Breaking News

'నోరు మూసుకొని వెళ్లి ఆడు'.. రిజ్వాన్‌ ఓవరాక్షన్‌! వీడియో వైరల్‌

Published on Fri, 12/20/2024 - 21:07

కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 81 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో పాక్ కైవసం చేసుకుంది.

అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది.

అసలేం ఏమి జరిగిందంటే?
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 26 ఓవర్ వేసిన పాక్ పేసర్ హారీస్ రవూఫ్ ఆఖరి బంతిని క్లాసెన్‌కు బౌన్సర్‌గా సంధించాడు. ఆ బంతిని క్లాసెన్ ఆడటంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో క్లాసెన్‌ను రవూఫ్ ఏదో అన్నాడు. అందుకు ప్రోటీస్ వికెట్ కీపర్ బ్యాటర్ సైతం గట్టిగా బదులిచ్చాడు. 

దీంతో అంపైర్లు జోక్యం చేసుకుని  గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మహ్మద్ రిజ్వాన్ అనవసరంగా జోక్యం చేసుకుని క్లాసెన్ వైపు వేలు చూపిస్తూ ముందు వెళ్లి సైలెంట్‌గా ఆడు అన్నట్లు సైగ చేశాడు.

దీంతో చిర్రెత్తిపోయిన క్లాసెన్ సైతం తన నోటికి పని చెప్పాడు.  క్లాసన్ సైతం రిజ్వాన్ పై మాటలతో మండిపడ్డాడు. ఈ క్రమంలో అంపైర్‌లు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

క్లాసెన్‌కు ఫైన్‌..
కాగా ఈ మ్యాచ్‌లో క్లాసెన్ ఒంటరి పోరాటం చేశాడు. 97 ప‌రుగులు చేసిన క్లాసెన్ ఆఖ‌రి వికెట్‌గా వెనుదిర‌గాడు. దీంతో  ఔటైన కోపంలో క్లాసెన్ త‌న‌ కాలితో స్టంప్స్‌ను పడగొట్టాడు. ఈ విషయాన్ని ఐసీసీ సీరియస్‌గా తీసుకుంది. మ్యాచ్‌ రిఫరీ ఫిర్యాదు మేరకు క్లాసెన్‌ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)