Breaking News

రాణించిన రియాన్‌ పరాగ్‌

Published on Sun, 09/22/2024 - 11:12

సాక్షి,  అనంతపురం: యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ (101 బంతుల్లో 73; 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) రాణించడంతో భారత్‌ ‘సి’తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ చివరి రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ ‘ఎ’ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. శాశ్వత్‌ రావత్‌ (53; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), కుమార్‌ కుషాగ్ర (40 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), కెపె్టన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (34) సత్తాచాటారు. భారత్‌ ‘సి’ బౌలర్లలో అన్షుల్‌ కంబోజ్, గౌరవ్‌ యాదవ్, మానవ్‌ సుతార్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 216/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ ‘సి’ జట్టు చివరకు 234 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ పొరెల్‌ (82), పులకిత్‌ నారంగ్‌ (41) ఆకట్టుకున్నారు. భారత్‌ ‘ఎ’ బౌలర్లలో అవేశ్‌ ఖాన్, అఖీబ్‌ ఖాన్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లు ఉన్న భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని ఓవరాల్‌గా 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. కుమార్‌ కుషాగ్రతో పాటు తనుశ్‌ కోటియాన్‌ (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు.  

స్కోరు వివరాలు 
భారత్‌ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌: 297; 
భారత్‌ ‘సి’ తొలి ఇన్నింగ్స్‌: 234; 
భారత్‌ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్‌: ప్రథమ్‌ సింగ్‌ (సి) రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) గౌరవ్‌ యాదవ్‌ 11; మయాంగ్‌ అగర్వాల్‌ (బి) అన్షుల్‌ కంబోజ్‌ 34; తిలక్‌ వర్మ (సి) రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) అన్షుల్‌ కంబోజ్‌ 19; రియాన్‌ పరాగ్‌ (సి) రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) గౌరవ్‌ యాదవ్‌ 73; శాశ్వత్‌ రావత్‌ (బి) మానవ్‌ సుతార్‌ 53; కుమార్‌ కుషాగ్ర (నాటౌట్‌) 40; షమ్స్‌ ములానీ (సి) అన్షుల్‌ కంబోజ్‌ (బి) మానవ్‌ సుతార్‌ 8; తనుశ్‌ కోటియాన్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం (64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి) 270. వికెట్ల పతనం: 1–35, 2–73, 3–94, 4–199, 5–209, 6–234, బౌలింగ్‌: అన్షుల్‌ కంబోజ్‌ 16–3–52–2; గౌరవ్‌ యాదవ్‌ 14–0– 60–2; 
విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ 6–0–36–0; పులకిత్‌ నారంగ్‌ 8–1–30–0; మానవ్‌ సుతార్‌ 20–0–75–2.

 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)