Breaking News

పోరాడి ఓడిన రిత్విక్‌ జోడీ

Published on Fri, 10/17/2025 - 04:37

సాక్షి, హైదరాబాద్‌: అల్మాటీ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీకి నిరాశ ఎదురైంది. కజకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రిత్విక్‌ చౌదరీ–అర్జున్‌ ఖడే (భారత్‌) జోడీ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. 

మూడో సీడ్‌ జాకబ్‌ ష్నయిటర్‌–మార్క్‌ వాల్నర్‌ (జర్మనీ) జంటతో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో రిత్విక్‌–అర్జున్‌ జోడీ 7–6 (7/2), 6–7 (11/13), 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో పోరాడి ఓడిపోయింది. ఒక గంట 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రిత్విక్‌–అర్జున్‌ రెండు ఏస్‌లుసంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశారు. మ్యాచ్‌ మొత్తంలో రెండు జోడీలు తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడం విశేషం. 

అయితే ‘సూపర్‌ టైబ్రేక్‌’లో జర్మనీ జోడీ పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తొలి రౌండ్‌లో ఓడిన రిత్విక్‌–అర్జున్‌ జంటకు 5,740 (రూ. 5 లక్షలు) డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది.   ఈ ఓటమితో రిత్విక్‌ సోమవారం విడుదలయ్యే ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు పడిపోయి 70 నుంచి 82వ ర్యాంక్‌కు చేరుతాడు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?