అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌: సౌరవ్‌ గం‍గూలీ

Published on Tue, 08/13/2024 - 09:28

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిష‌బ్ పంత్ భ‌విత‌వ్యంపై అనేక ఊహ‌గానాలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్‌ మెగా వేలం నేప‌థ్యంలో పంత్‌ను ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

వచ్చే ఏడాది సీజన్‌లో సీఎస్‌కే పంత్ ఆడనున్నాడని కొంతమంది క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ క్రికెట్ డైర‌క్ట‌ర్ సౌర‌వ్ గంగూలీ స్పందించాడు. పంత్‌పై వ‌స్తున్న వార్త‌ల‌న్ని అవాస్తవమని దాదా కొట్టి పారేశాడు. 

వ‌చ్చే ఏడాది సీజ‌న్‌లో పంత్ తమ జట్టులో ఉంటాడని, అతడే తమ కెప్టెన్‌గా కొనసాగుతాడని  ఓ మీడియా ఛాన‌ల్‌తో మాట్లాడిన దాదా స్ప‌ష్టం చేశాడు. కాగా దాదాపు 16 నెల‌ల పాటు  రోడ్డు ప్రమాదం కారణంగా క్రికెట్‌కు దూర‌మైన పంత్‌.. ఐపీఎల్ 2024తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. 

అయితే పంత్ తన ఆటతీరుతో ఆకట్టుకున్నప్పటకి.. జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఈ ఏడాది సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన పంత్‌.. 446 పరుగులతో ఢిల్లీ తరపున టాప్‌ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ తమ హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌పై వేటు వేసింది. క్రికెట్‌ డైరక్టర్‌గా ఉన్న గంగూలీనే హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)