Breaking News

విధ్వంసకర శతకం.. చరిత్ర సృష్టించిన రికెల్టన్‌

Published on Sun, 01/11/2026 - 10:41

సౌతాఫ్రికా టీ20లో ఎంఐ కేప్‌టౌన్‌ ఆటగాడు ర్యాన్‌ రికెల్టన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లీగ్‌ చరిత్రలో రెండు వ్యక్తిగత సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రికెల్టన్‌ కాకుండా SA20లో మరో ఎనిమిది మంది (డుప్లెసిస్‌, క్లాసెన్‌, మార్క్రమ్‌, డస్సెన్‌, హెర్మన్‌, విల్‌ జాక్స్‌, వెర్రిన్‌, హోప్‌) మాత్రమే తలో సెంచరీ చేశారు. 

రికెల్టన్‌ తలో రెండో సెంచరీని 2025-26 ఎడిషన్‌లో భాగంగా జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. రికెల్టన్‌ తన తొలి సెంచరీని డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌పై చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రికెల్టన్‌ విధ్వంసకర శతకంతో (60 బంతుల్లో 113 నాటౌట్‌; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో సూపర్‌ కింగ్స్‌పై ఎంఐ కేప్‌ టౌన్‌ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ కేప్‌టౌన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగా.. ఛేదనలో పోరాడిన సూపర్‌ కింగ్స్‌ లక్ష్యానికి 37 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగలిగింది. సూపర్‌ కింగ్స్‌​ తరఫున డియాన్‌ ఫెరియెరా (80 నాటౌట్‌) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినా, తన జట్టును గెలుపు తీరాలు దాటించలేకపోయాడు. సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ జేమ్స్‌ విన్స్‌ (77) కూడా మెరుపు అర్ద సెంచరీతో రాణించాడు.

ఎంఐ బౌలర్ల జోరు ముందు వీరి మెరుపులు సరిపోలేదు. జార్జ్‌ లిండే, రబాడ తలో 2, కార్బిన్‌ బాష్‌ ఓ వికెట్‌ తీయగా.. రషీద్‌ ఖాన్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి సూపర్‌ కింగ్స్‌ను కట్టడి చేశారు. అంతకుముందు ఎంఐ ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌తో పాటు మరో ఓపెనర్‌ డస్సెన్‌ (65) కూడా రాణించాడు. మిగతా బ్యాటర్లలో పూరన్‌ 14, జేసన్‌ స్మిత్‌ 2, కరీం జనత్‌ 20 (నాటౌట్‌) పరుగులు చేశారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో డేనియల్‌ వార్రల్‌ 2, ఫెరియెరి తలో వికెట్‌ తీశారు.

 

 

 

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)