బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్‌.. 44 పరుగుల తేడాతో విజయం

Published on Sun, 04/28/2024 - 21:25

బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. సెల్హాట్‌ వేదికగా వేదికగా బంగ్లాదేశ్‌ మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో భారత్‌ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ 1-0 అధిక్యంలోకి వెళ్లింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో యస్తికా భాటియా(36) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(30), షెఫాలీ వర్మ(31) పరుగులతో రాణించారు. 

బంగ్లా బౌలర్లలో రబియా ఖాన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మరుఫా అక్తర్‌ రెండు, త్రిష్నా, ఫాతిమా ఖాటూన్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 101 పరుగులకే పరిమితమైంది.

బంగ్లా బ్యాటర్లలో కెప్లెన్‌ సుల్తానా(51) ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో రేణుక సింగ్‌ ఠాకూర్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. పూజా రెండు, శ్రేయంకా, దీప్తి శర్మ, రాధా యాదవ్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఏప్రిల్‌ 30న జరగనుంది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)