Breaking News

ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్‌.. ఇక కష్టమే

Published on Sun, 10/22/2023 - 20:20

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస అపజయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఫాస్ట్‌ బౌలర్‌ రీస్ టోప్లీ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టోప్లీ చూపుడు వేలికి గాయమైంది.

దీంతో అతడు ఫీల్డ్‌ను వదిలి వెళ్లిపోయాడు. అయితే ఫిజియో వద్ద చికిత్స తీసుకుని టోప్లీ తిరిగి మళ్లీ మైదానంలోకి వచ్చాడు. నొప్పితో బాధపడుతుంటానే 6 ఓవర్లు బౌలింగ్‌ చేశాడు. ఓవరాల్‌గా 8.5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన టోప్లీ 88 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ అనంతరం  టోప్లీని స్కాన్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే స్కానింగ్‌లో ఎడమ చూపుడు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. దీంతో అతడు టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు దృవీకరించింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్,  సర్రే సీమర్ రీస్ టాప్లీ చేతి వేలికి గాయమైంది. దీంతో వన్డే ప్రపంచకప్ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. టోప్లీ రాబోయే 24 గంటల్లో తిరిగి యూకేకు రానున్నాడు అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఒక​ ప్రకటనలో పేర్కొంది.

కాగా దక్షిణాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌లో ఇంగ్లీష్‌ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్ధానంలో ఉంది.
చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ.. తొలి భారత బౌలర్‌గా

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)