Breaking News

సునీల్‌ ఛెత్రి హ్యాట్రిక్‌

Published on Sun, 12/08/2024 - 10:00

బెంగళూరు: స్టార్‌ స్ట్రయికర్‌ సునీల్‌ ఛెత్రి (8వ, 73వ, 90+8వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో విజృంభించడంతో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఏడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో బెంగళూరు జట్టు 4–2 గోల్స్‌తో కేరళ బ్లాస్టర్స్‌పై గెలుపొందింది. భారత మాజీ కెపె్టన్‌ ఛెత్రి ఐఎస్‌ఎల్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన పెద్ద వయసు్కడి (40 ఏళ్ల 126 రోజులు)గా రికార్డుల్లోకి ఎక్కాడు. 

గతంలో ఓగ్బచే (38 ఏళ్ల 96 రోజుల్లో) పేరిట ఉన్న ఈ రికార్డును ఛెత్రి తిరగరాశాడు. ర్యాన్‌ విలియమ్స్‌ (38వ నిమిషంలో) ఒక గోల్‌ చేశాడు. కేరళ బ్లాస్టర్స్‌ తరఫున జీసెస్‌ జిమెన్జ్‌ (56వ నిమిషంలో), ఫ్రెడ్డీ (67వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు. నిర్ణీత సమయంలో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఐదుసార్లు దాడి చేసి అందులో నాలుగు గోల్స్‌ సాధించగా.. కేరళ బ్లాస్టర్స్‌ ఏడుసార్లు ప్రయతి్నంచి అందులో రెండు సార్లు మాత్రమే సఫలమైంది. 

ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ 7 విజయాలు, 2 పరాజయాలు, 2 ‘డ్రా’లతో 23 పాయింట్లు ఖాతాలో వేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కేరళ జట్టు 11 పాయింట్లతో పట్టిక పదో స్థానంలో నిలిచింది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో ఈస్ట్‌ బెంగాల్‌ 2–0 గోల్స్‌ తేడాతో చెన్నైయిన్‌ ఎఫ్‌సీపై గెలుపొందింది. ఈస్ట్‌ బెంగాల్‌ జట్టు తరఫున విష్ణు (54వ నిమిషంలో), జాక్సన్‌ సింగ్‌ (84వ నిమిషంలో) చెరో గోల్‌తో సత్తా చాటారు.    

#

Tags : 1

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు